నాచురల్ స్టార్ నాని(Nani) హీరోగా నటిస్తున్న చిత్రం ‘అంటే సుందరానికీ’. దర్శకుడు వివేక్ ఆత్రేయ కంప్లీట్ ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ హీరోయిన్‌గా నటిస్తోంది. నజ్రియాకు తెలుగులో ఇదే తొలి చిత్రం కావడం విశేషం. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి నవీన్ ఎర్నేని, రవిశంకర్ .వై నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అలాగే చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు.
ఫుల్ ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నానికి జోడిగా మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ నటిస్తోంది.
ఈ మూవీలో నజ్రియా లీలా థామస్‌గా నటించనుంది. ఈ సినిమాను జూన్ 10వ తేదీన విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవల హీరోయిన్ ఫస్ట్ లుక్ వీడియోని విడుదల చేసిన చిత్ర యూనిట్. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేశారు చిత్ర బృందం. ఇందులో పంచకట్టులో నాని ఎంతగానో ఆకట్టుకున్నాడు.
Recent Comment