మెగాస్టార్‌ చిరంజీవి ( Chiranjeevi ) కథానాయకుడుగా డైరెక్టర్ కొరటాల శివ( Koratala Shiva ) దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఆచార్య'(Acharya). మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ( Ram Charan ) ఇందులో ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా చందమామ కాజల్ హీరోయిన్‌గా నటించగా.. రామ్‌ చరణ్‌కు జంటగా బుట్టబొమ్మ పూజా హెగ్డే నటించింది. అలాగే సోనూసూద్‌ ముఖ్య పాత్ర పోషించాడు. రామ్‌చరణ్, నిరంజన్‌ రెడ్డి, అన్వేష్‌ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్‌ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుద‌లైన ట్రైల‌ర్‌కు భారీ స్థాయిలో స్పందన వచ్చింది . ఇక వెండితెరపై చిరు-చరణ్ క‌లిసి చేసే పోరాటాలను చూడ‌టానికి అభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలాఉంటే, ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ‘ఆచార్య’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఏ రోజు నిర్వ‌హాస్తార‌నే టాక్ ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది. అయితే తాజా స‌మాచారం మేర‌కు ఈ ఆచార్య సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఏప్రిల్ 24న పెద్ద ఎత్తున నిర్వ‌హించ‌డానికి చిత్రబృందం ప్లాన్ చేశారు. యూసఫ్‌‌‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌‌‌లో జరగనున్న ఈ వేడుకకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా అనుమతులు కూడా ఇచ్చినట్టు సమాచారం.