మెగాస్టార్‌ చిరంజీవి(Chiranjeevi) హీరోగా యువ దర్శకుడు బాబీ ఓ సినిమా రూపొందిస్తున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌లో చిరంజీవి 154వ(Chiru 154) చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమాకు ‘వాల్తేరు వీరయ్య’ అనే టైటిల్‌ను పరిశీలిస్తోందట చిత్రయూనిట్. విశాఖపట్నం షిప్‌ యార్డ్ నేపథ్యంలో మాస్‌ యాక్షన్‌ సినిమాగా రూపొందనుందని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది.

ఈ షెడ్యూల్ లో చిరంజీవిపై భారీ యాక్షన్ సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. ఈ యాక్షన్ సీన్స్ ను రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ పర్యవేక్షిస్తున్నారు. కాగా, దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ ఓ ముఖ్య పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. చిరంజీవి, రవితేజ అన్నదమ్ముల పాత్రలో అలరించనున్నారని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక చిరంజీవి 154వ చిత్రంలో ఆయనకు జోడీగా శ్రుతిహాసన్‌ నటించనుండగా.. తమిళ బ్యూటీ నివేదా పేతురాజ్‌ రవితేజ సరసన నటించనున్నట్లు సమాచారం.