కన్నడ కథానాయకుడు యశ్(Yash) హీరోగా, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్(Prashanth Neel) దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా “కేజీఎఫ్-2″(KGF2). 2018లో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన కేజీఎఫ్ సినిమాకు సీక్వెల్‌గా ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో రూపొందుతోంది. ఈ మూవీని హోంబలే ఫిలింస్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు. కన్నడ, తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కేజీఎఫ్ 2 వేసవి కానుకగా ఏప్రిల్ 14న విడుదల కానుంది.
అయితే తాజాగా ఈ సినిమా నుంచి చిత్రబృందం ఓ నోట్ విడుదల చేసింది. కేజీఎఫ్ చాప్టర్ 1 విడుదలై మూడేళ్లు గడిచింది. మీరు చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు. మీ ఆశీస్సులతోనే కేజీఎఫ్ చాప్టర్ 2 చేస్తున్నాం. అందుకే ఈ మూవీ ప్రమోషన్లలో మీ అందరూ పాల్గొనాలి అనుకుంటున్నాం. అందుకే మీరు చేసే ఫ్యాన్ మేడ్ పోస్టర్లు, గీసే స్కెచ్ లను భారీ హోర్డింగ్స్‌గా తయారుచేస్తాం. రాకీ భాయ్ మీ కోసం ఎదురుచూస్తున్నాడు అని ఆ నోట్ లో చెప్పుకొచ్చారు.
కాగా, ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి, ప్రకాశ్ రాజ్, రవీనా టండన్, రావు రమేశ్ తదితరులు ముఖ్యపాత్రల్లో నటించగా.. రవి బస్రూర్ సంగీతం అందించారు. భారీ అంచనాలతో వస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.
Recent Comment