యువ కథానాయకుడు రామ్‌ పోతినేని(Ram Pothineni) హీరోగా తమిళ సీనియర్ దర్శకుడు లింగుస్వామి(Lingu Swamy) దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ది వారియర్‌’. (The Warrior) ఈ మూవీలో రామ్‌ పవర్‌ ఫుల్‌ పోలీసు ఆఫీసర్‌ పాత్రలో అలరించబోతున్నాడు. అయితే ఈ సినిమా నుంచి ఆస‌క్తిక‌ర‌మైన అప్ డేట్ తెర‌పైకి వ‌చ్చింది. కోలీవుడ్ స్టార్ హీరో శింబు ది వారియ‌ర్ సినిమాలో ఓ పాట పాడుతున్నాడు. దేవీ శ్రీ ప్ర‌సాద్ సంగీత స్వరాలు సమకూర్చిన ఈ పాటను శింబు పాడాడు.

ఈ క్రమంలోనే దర్శకుడు లింగుస్వామి, శింబు, రామ్‌, దేవిశ్రీప్రసాద్ క‌లిసి దిగిన ఫొటోను చిత్రబృందం రిలీజ్ చేశారు. కాగా, ఆది పినిశెట్టి విలన్‌గా నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ నిర్మించిన ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఈ సినిమాలో రామ్ సరసన కృతీ శెట్టి, అక్షర గౌడ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ‘ది వారియర్‌’ మూవీ చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ‘ది వారియర్‌’ సినిమా జూలై 14న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున విడుదల కానుంది.