తేజ సజ్జ (Teja Sajja) హీరో గా, ప్రశాంత్ వర్మ (Prashanth Varma) దర్శకత్వములో ఈ సంక్రాంతికి వచ్చి సూపర్ హిట్ అయిన హనుమాన్ (Hanuman)100 రోజులు అయ్యింది.   ఈ సినిమా విడుదలకు ముందు థియేటర్ లు దొరకక చాలా ఇబ్బందుల మధ్య విడుదలయ్యింది.

ఇప్పుడున్న పరిస్థుతులలో ఒక సినిమా వంద రోజులు ఆడడం అనేది అద్భుతం అని చెప్పాలి.  అంతే కాక హనుమాన్ 25 సెంటర్ల లో వంద రోజులు పూర్తి చేసుకుంటుంది.  ఈ విషయాన్ని ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ (Prime Show Entertainment) వారు అధికారిగా ‘x’ లో పోస్ట్ చేసారు.

ఈ వంద రోజుల పండగ కూడా సరిగ్గా హనుమద్విజయోత్సవం (23rd April) దగ్గర్లో జరిగింది. ఈ సినిమా జీ తెలుగు లో ప్రీమియర్ గా అతి త్వరలో రాబోతోంది