ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun)-క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన మూవీ ‘పుష్ప’.(Pushpa) గతేడాది డిసెంబర్‌లో విడుదలైన ఈమూవీ క్రేజ్ ఇప్పటికీ కొనసాగుతుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా సీక్వెల్‌గా పుష్ప: ది రూలర్ పార్ట్ 2 ప్రస్తుతం రూపొందుతోన్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా సంయుక్త సమర్పణలో రూపొందిన ఈ సినిమాలో రష్మిక హీరోయిన్‌గా(Rashmika Mandanna) నటించింది.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర అప్ డేట్ ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది. ఈ సినిమాలో సమంత కోసం ప్రత్యేకంగా ఓ క్యారెక్టర్ క్రియేట్ చేశారని తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికార ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. వాస్తవానికి ఫిబ్రవరిలోనే పుష్ప- 2 రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించాలని దర్శకుడు సుకుమార్ అనుకున్నారు. కానీ ప్రీ ప్రొడక్షన్ పనులు లేట్ అవడంతో సినిమా షూటింగ్ ఆలస్యం అయింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జులై నెల తొలి వారంలో ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. కాగా, ఈ సినిమాలో సునీల్, అనసూయ, జగదీష్ ప్రతాప్ భండారీ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించనున్నారు.
Recent Comment