దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli),
యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్(Ntr), మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్(Ram Charan) ల కాంబినేష‌న్లో తెరకెక్కిన చిత్రం “ఆర్ఆర్ఆర్”.ఇందులో కొమురం భీమ్‌గా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌.. అల్లూరి సీతా రామరాజుగా మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టించారు. డీవీవీ ఎంటర్‏టైన్మెంట్స్, పెన్ స్టూడియోస్, లైకా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకువచ్చింది. అయితే ఈ సినిమా చూశాక డైరెక్టర్ రాజమౌళి ప్రతిభ చూసి అందరూ సంబరపడిపోతోన్నారు. అలాగే రామ్ చరణ్, ఎన్టీఆర్ నటనకు అందరూ ఫిదా అవుతున్నారు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమా సరికొత్త రికార్డులను సాధిస్తుందని అందరూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే, ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమా ఓటీటీ విడుదల తేదీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా విడుదలకు ముందే ఈ సినిమా ఒక్క నెల రోజుల్లోనే ఓటీటీలో వస్తుందనే వార్తలు వినిపించాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా మూడు నెలల వరకు ఓటీటీకి వచ్చే ఛాన్స్ లేదని సమాచారం. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ఆర్ఆర్ఆర్ మూవీ జూన్‌ నెల ముగిసిన తర్వాతే ఓటీటీలోకి రానున్నట్లు తెలుస్తోంది. ఇక ఆర్ఆర్ఆర్ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం వెర్షన్‌ డిజిటల్ రైట్స్ ను జీ5 సంస్థ భారీ మొత్తానికి దక్కించుకున్న సంగతి తెలిసిందే.