యంగ్ హీరో వరుణ్‌ తేజ్‌(Varun Tej) కథానాయకుడుగా కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘గని’(Ghani). ఇందులో వరుణ్‌ తేజ్‌ కు జోడీగా బాలీవుడ్‌ నటి సయీ(Sayi Manjrekar) మంజ్రేక‌ర్ న‌టిస్తోంది. ఉపేంద్ర‌(Upendra), సునీల్ శెట్టి(Sunil Shetty), న‌వీన చంద్ర(Naveen Chandra), జగపతి బాబు(Jagapati Babu) త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్‌ సమర్పణలో అల్లు బాబీ, సిద్ధు ముద్ద నిర్మించారు. . కాగా, ఈ సినిమాలో వ‌రుణ్‌ తేజ్ ఇప్ప‌టి వ‌ర‌కు చేయ‌ని డిఫ‌రెంట్ క్యారెక్టర్‌లో సరికొత్త లుక్‌లో బాక్సర్‌గా అలరించబోతున్నాడు. అందులోని వరుణ్‌ తేజ్ మాస్‌ లుక్‌ ఇప‍్పటికే మెగా అభిమానులకు తెగ నచ్చేసింది. ఈ చిత్రం ఏప్రిల్ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్‌ కార్యక్రమాలను వేగవంతం చేసింది చిత్రబృందం. ఈ క్రమంలోనే ఏప్రిల్ 2న విశాఖపట్నం వేదికగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించనుంది. అయితే గ్రాండ్ గా నిర్వహించనున్న ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్‌ రానున్నారట. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా ‘గని’ చిత్రబృందం వెల్లడించింది. బన్నీఈ కార్యక్రమానికి రానుండడంతో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి… కాగా, ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తుండగా.. సునీల్ శెట్టి, ఉపేంద్రలు కీలక పాత్రల్లో నటించారు