దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి(Rajamouli) దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR), మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్(Ram Charan) హీరోలుగా తెరకెక్కించిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ (RRR) మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమాను చూసేందుకు అభిమానులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఈ సినిమా 11 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ ను పూర్తి చేసి లాభాల వైపు పరుగులు తీస్తోంది.
మొత్తంగా చూస్తే ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా కలిపి 11 రోజుల్లో, 819 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది.
ఇండియన్ ట్రేడ్ అనలిస్ట్ మనోబల విజయాబాలన్ ప్రకారం ‘ఆర్ఆర్ఆర్’ (RRR) భారతదేశం లో అత్యధిక గ్రాస్ వసూళ్లను సాధించిన చిత్రాల జాబితాలో ఐదవ స్థానంలో నిలిచింది. ఈ క్రమంలో అమీర్ ఖాన్ పీకే, రజనీకాంత్ 2.O వసూళ్లను అధిగమించింది.
ఐయండిబి, మోస్ట్ పాపులర్ సినిమాల లిస్టు లో టాప్ 5 లో నిలిచిన ఒకే ఒక ఇండియన్ సినిమా గా ‘ఆర్ఆర్ఆర్’ (RRR) నిలిచింది. ఇంతే కాదు, ముఖ్యం గా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, మొదటి నాలుగు స్థానాలలో నిలిచిన హాలీవుడ్ సినిమాల కన్నా ‘ఆర్ఆర్ఆర్’ (RRR) సినిమాకు ఎక్కువ రేటింగ్ రావడం. ఇటీవల ఆస్కార్ అవార్డు గెలుచుకున్న కోడా చిత్రానికి 8.1 రేటింగ్ రాగ, ది బాట్మన్ చిత్రానికి 8.3 రేటింగ్ వచ్చింది. అయితే ‘ఆర్ఆర్ఆర్’ (RRR) కు 9 రేటింగ్ వచ్చింది. ఈ సినిమాకు ఇంత పెద్ద విజయాన్ని ప్రేక్షకులు ఇచ్చారంటే దానికి కారణం, దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి(Rajamouli) ప్రతిభ, రామ్ చరణ్, ఎన్ టి ఆర్ ల నట విశ్వరూపం
Recent Comment