కన్నడ అగ్రకథానాయకుడు యశ్(Yash) ప్రధాన పాత్రలో స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్(Prashanth Neel) దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా “కేజీఎఫ్-2″(KGF Chapter 2) 2018లో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన కేజీఎఫ్ సినిమాకు సీక్వెల్‌గా ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో రూపొందుతోంది. ఈ సినిమాను హోంబలే ఫిలింస్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు. కేజీఎఫ్ 2 మూవీ ఏప్రిల్ 14న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.
అయితే KGF chapter 2 ఇప్పుడు 10 వేలకు పైగా స్క్రీన్ లలో రిలీజ్ కాబోతుంది. ఉత్తరాదిలో 4,400 కి పైగా స్క్రీన్స్ లో ఈ సినిమా విడుదల కానుండగా.. దక్షిణాదిలో 2,600 కి పైగా స్క్రీన్స్ లో, అలాగే హిందీ, ఓవర్సీస్ లలో 1,100 కి పైగా స్క్రీన్స్ లో విడుదల కానుంది. అదేవిధంగా మిగతా దక్షిణాది బాషల్లో 2,900 కి పైగా స్క్రీన్ లలో కేజిఎఫ్ 2 సినిమా రిలీజ్ కానుంది. కాగా, ఈ సినిమా జోరు చూస్తుంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో రికార్డులు క్రియేట్ చేసేట్టు కనిపిస్తోంది. దేశ వ్యాప్తంగా KGF2 తొలి రోజే వంద కోట్ల కలెక్షన్స్ రాబట్టేలా కనిపిస్తోంది.
Recent Comment