పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో, మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 9 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది.  ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 5 పరుగులకే అవుట్ అయినా, మరో ఓపెనర్ శిఖర్ ధావన్ 35 పరుగులు చేశాడు. 

అయితే లివింగ్ స్టోన్ ఆట మ్యాచ్ కే హైలెట్. లివింగ్ స్టోన్ కేవలం 27 బంతుల్లో,  ఏడు ఫోర్లు, నాలుగు సిక్సర్ల సహాయంతో 64 పరుగులు చేశాడు. ఆ తరవాత వచ్చిన జితేష్ శర్మ 11 బంతుల్లో 23 పరుగులు,షారుఖ్ ఖాన్ 8 బంతుల్లో 15 పరుగులు చేశారు. 

చివరి వరుస బ్యాట్స్ మన్ అయిన రాహుల్ చాహర్, ఆర్ష్ దీప్ సింగ్ లు కలిసి 19 బంతుల్లో 32 పరుగులు జోడించారు.

జితేష్ శర్మ, షారుఖ్ ఖాన్, రాహుల్ చాహర్, ఆర్ష్ దీప్ సింగ్ లు ధాటిగా ఆడి స్కోర్ బోర్డ్ ను పరిగెత్తించారు.

గుజరాత్ టైటాన్స్ బౌలర్ల లో రషీద్ ఖాన్ మూడు వికెట్లు, దర్శన్ నల్ కండె రెండు వికెట్లు తీయగా, షమీ, పాండ్య, ఫెర్గుసన్ లు తలా ఒక వికెట్ తీశారు.

అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన గుజరాత్ టైటాన్స్ 32 పరుగుల వద్ద తొలి వికెట్ ను కోల్పోయింది. అయితే శుభమన్ గిల్ ధాటిగా ఆడుతున్నాడు.  కడపటి వార్తలందేసరికి గుజరాత్ టైటాన్స్ నాలుగు ఓవర్ల లో ఒక వికెట్ నష్టానికి 37 పరుగులు చేసింది