మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌ (Ram Charan) హీరోగా సీనియర్ డైరెక్టర్ శంకర్‌(Shankar) దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాలో రామ్‌చరణ్‌ రెండు విభిన్న పాత్రల్లో క‌నిపించ‌నున్నట్లు సమాచారం. అందులో ఒకటి స్టూడెంట్‌ పాత్ర కాగా, మరొకటి ప్ర‌భుత్వ ఉద్యోగి పాత్ర అన్నట్లు తెలుస్తోంది. ఇవే కాకుండా ఈ చిత్రంలో రామ్‌చరణ్‌ మరో సరికొత్త పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది.

అయితే, భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా విషయంలో రామ్ చరణ్ అభిమానులు సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే దర్శకుడు శంకర్ తన స్టైల్ లో ఎక్కడ కూడా తగ్గకుండా రామ్ చరణ్ ని ఎలివేట్ చేస్తున్నట్లు ఫ్యాన్స్ కు అర్థమైంది. ఈ సినిమాలు రామ్ చరణ్ ను డిఫరెంట్ రోల్స్ లో చూపించడం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తుంది. కాగా, ఈ సినిమాకి స‌ర్కారోడు అనే టైటిల్‌ను చిత్రబృందం ప‌రిశీలిస్తున్న‌ట్టు తెలుస్తోంది. కాగా, ఈ సినిమాలో సునీల్, నవీన్‌ చంద్ర, అంజలి కీలక పాత్రలు పోషిస్తున్నారు. RC15 అనే వర్కింగ్‌ టైటిల్‌తో రూపొందుతున్న ఈ మూవీని ‘దిల్‌’ రాజు ఓ భారీ ప్యాన్‌ ఇండియా మూవీ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలనుకుంటున్నారు.