తెలుగు సినిమా ప్రదర్శించడానికి వేదికలు చాలా ఉన్నాయ్. మొదట థియేటర్ లో రిలీజ్ అవుతాయి. ఆ తరవాత OTT Platforms లో విడుదల అవుతాయి. చివరిగా బుల్లి తెర (Television) లోకి వస్తాయి. బుల్లి తెర కి వచ్చాక నెలకొక సారి టెలివిజన్ లో ప్రసారమవుతాయి. అయితే మొదటి సారి వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రసారమవుతాయి.
ఈ ఉగాదికి స్టార్ మా లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా డి జె తిల్లు’ను ప్రసారం చేశారు. జెమినీ లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ శ్యామ్ సింగ రాయ్’ ను ప్రసారం చేశారు.
చిన్న సినిమాగా విడుదలై అతి పెద్ద విజయం సాధించిన చిత్రం ‘డి జె తిల్లు’. టెలివిజన్ లో కూడా ఈ సినిమా బ్లాక్ బస్టర్. ‘డి జె తిల్లు’ స్టార్ మా లో 10.83 రేటింగ్ సాధించగా, జెమినీ లో ప్రసారం చేసిన ‘శ్యామ్ సింగ రాయ్’ 6.87 రేటింగ్ సాధించింది.
అయితే ఉగాది స్పెషల్ ఈవెంట్ ల లో మాత్రం, ఈటీవీ, స్టార్ మా మీద పై చేయి సాధించింది. ఈటీవీ అంగరంగ వైభవం గా 10.10 రేటింగ్ ను సాధించింది. స్టార్ మా ‘ఆగట్టునుంటావా ఈ గట్టు కొస్తావా’ 8.24 రేటింగ్ ను సాధించింది
Recent Comment