యంగ్ హీరో నిఖిల్‌ ( Nikhil ) కథానాయకుడుగా చందూ మొండేటి ( Chandu Mondeti )దర్శకత్వంలో ఎనిమిదేళ్ల కిందట వచ్చిన ‘కార్తికేయ’ మూవీ సూపర్ హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘కార్తికేయ 2’ ( Karthikeya 2 )తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీని పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ సంస్థలు నిర్మిస్తున్నాయి. నిఖిల్ కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

ఇటీవలే కార్తికేయ 2 మూవీ చిత్రీకరణను స్పెయిన్, పోర్చుగల్ దేశాల్లో పూర్తి చేశారు. అయితే ఈ సినిమా జూలై 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే డిజిటల్, శాటిలైట్ రైట్స్ కళ్ళుచెదిరే మొత్తానికి జీ సంస్థలు దక్కించుకున్నాయి. కాగా, ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ ( Anupama Parameshwaran ) హీరోయిన్ గా నటిస్తుండగా.. బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. కాగా, ఈ చిత్రానికి కాలభైరవ సంగీతం సమకూరుస్తుండగా.. కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో ‘కార్తికేయ 2’ చిత్రాన్ని మేకర్స్ విడుదల చేయాలనుకుంటున్నారు.