మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్రలో న‌టించిన తాజా చిత్రం ‘ఆచార్య’(Acharya). ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సిద్ధ అనే పాత్ర‌లో న‌టించారు. కొర‌టాల శివ ద‌ర్శ‌కత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఏప్రిల్ 29న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుదల‌వుతుంది. ఈ సినిమాలో చిరంజీవి సరసన కాజల్ కథానాయికగా నటించగా.. రామ్‌ చరణ్‌కు జోడీగా పూజా హెగ్డే నటించింది. ఇటీవల విడుద‌లైన సినిమా ట్రైల‌ర్‌కు అద్భుతమైన స్పందన వ‌చ్చింది.

కాగా, అయితే ఈ సినిమా విడుదల తేది దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ వేగవంతం చేశారు మేకర్స్. ఈ క్రమంలోనే ఆచార్య సినిమా నుంచి “భళే భళే బంజారా” అనే సాంగ్ ని సోమవారం రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. తాజాగా ఆదివారం ఆ పాటకు సంబంధించిన గ్లింప్స్‌ను రిలీజ్ చేసి అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చారు చిత్రబృందం. ఇందులో చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్ నువ్వా నేనా అన్నట్లు వేసిన స్టెప్పులు చూసి మెగా అభిమానులు ఫిదా అవుతున్నారు. మ‌ణిశ‌ర్మ సంగీత స్వరాలు సమకూర్చిన ‘భలే భలే బంజారా’ పాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా.. శంకర్ మహాదేవన్, రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు.