కోలీవుడ్‌ అగ్ర కథానాయకుడు దళపతి విజయ్‌ హీరోగా నటించిన చిత్రం ‘బీస్ట్‌’. నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో టాలీవుడ్‌ బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది.ప్రముఖ నిర్మాణ సంస్థ సన్‌ పిక్చర్స్‌ బ్యానర్‌లో కళానిధి మారన్‌ నిర్మాతగా బాధ్యతలు చేపట్టగా అనిరుధ్‌ రవిచంద్రన్‌ సంగీతం అందిస్తున్నారు. ఇదివరకు విడుదలైన పాటలతో సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి.

అయితే తాజాగా ఈ సినిమా తెలుగు పోస్ట‌ర్‌ను చిత్రబృందం రిలీజ్ చేశారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన చేసిన ప్ర‌చార చిత్రాలు, సాంగ్స్ సినిమాపై మ‌రింత అంచనాలు పెంచాయి. ఈ మూవీలోని అర‌బిక్ కుత్తూ పాట 220 మిలియన్ల‌కు పైగా వ్యూస్‌ను సాధించి సరికొత్త రికార్డులను సృష్టించింది. ఈ చిత్రం ఐదు భాష‌ల్లో పాన్ ఇండియా లెవ‌ల్లో ఏప్రిల్ 13న విడుద‌ల కానుంది.

చిత్రీకరణ ముగించుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోంది. ఈ సినిమాలో షైన్‌ టామ్‌ చాకో, సెల్వరాఘవన్‌, యోగిబాబు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.