ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా ఈ రోజు హైదరాబాద్, ఉప్పల్ స్టేడియం లో జరుగుతున్న మ్యాచ్ లో మొదట బాటింగ్ చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు ఏడువికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది.

విరాట్ కోహ్లీ 51 పరుగులు చేశాడు.  రజత్ పటీదార్ ఆటే హైలైట్.  కేవలం 20 బంతుల్లో 50 పరుగులు చేశాడు.  రజత్ పటీదార్, ఒకే ఓవర్ లో నాలుగు సిక్స్ లు బాదాడు.  గ్రీన్ 20 బంతుల్లో 37 పరుగులు చేసి అజేయం గా నిలిచాడు.

సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్ల లో ఉనద్కట్ మూడు వికెట్లు తీయగా, నటరాజన్ రెండు వికెట్లు తీశాడు.  కెప్టెన్ పాట్ కమ్మిన్స్, మార్కండే తలో ఒక వికెట్ తీశారు.