యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ(Vijay devarakonda) హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కతున్న పాన్ ఇండియా చిత్రం ‘లైగర్’(Liger) సాలా క్రాస్ బ్రీడ్ అనేది ఉపశీర్షిక. ఇందులో విజయ్ దేవరకొండ బాక్సర్‌గా నటిస్తున్నారు. దాదాపు వంద కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతుంది. అనన్య పాండే హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ కలిసి నిర్మిస్తున్నాయి. కాగా, స్పోర్ట్స్ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మైక్ టైసన్ కీలకపాత్రలో కనిపించనున్నారు. ఇందులో టైసన్ నటిస్తుండటంతో ఈ సినిమాకి అంతర్జాతీయంగా గుర్తింపు లభిస్తోంది.
ఇక ధర్మ ప్రొడక్షన్స్- పూరి కనెక్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న లైగర్ సినిమా ఆగస్ట్25న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉందట. దాని కోసం పూరీ జగన్నాథ్ టీమ్ సమంతను సంప్రదించినట్లు సమాచారం. కానీ సమంత స్పెషల్ సాంగ్ చేయడానికి ఒప్పుకోలేదని సమాచారం. దాంతో చిత్రబృందం మలయాళీ ముద్దుగుమ్మ ప్రియా ప్రకాష్ వారియర్‌ను సంప్రదించారట. దానికి ప్రియా వారియర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.
Recent Comment