1st Dec,2021, బాలకృష్ణ అఖండ రిలీజ్ అయిన రోజు.  కోవిద్ భయంతో ప్రేక్షకులు థియేటర్ కు వస్తారో, రారో అన్న సందిగ్ధంలో ఉన్న సమయం లో నిర్మాతలకు జోష్ ఇచ్చిన సినిమా అఖండ. 

అఖండ రిలీజ్ అయ్యిన తరువాత రివ్యూల తో సంబంధం లేకుండా మాస్ జాతరని తలపించేలా ప్రేక్షకులు థియేటర్లకు రావడం మొదలు పెట్టారు. Pandemic తరవాత మొదటి 100 కోట్ల సినిమా ఈ అఖండ అలాగే బాలకృష్ణ కు మొట్ట మొదటి 100 కోట్ల సినిమా.

అఖండ గా యువరత్న బాలకృష్ణ నటనకు మాస్ ప్రేక్షకులు బ్రహ్మ రధం పట్టారు.  బాలకృష్ణ ను ఎలా చూపించాలో, ఎలా చూపిస్తే ప్రేక్షకులు ఆదరిస్తారు అనేది నా ఒక్కడికే తెలుసనీ బోయపాటి మరోసారి నిరూపించాడు.

ఇప్పుడు మళ్ళీ అఖండ వస్తున్నాడు.  అఖండ ఆగమనం ఈ సారి బుల్లి తెర మీద.  ఈ 10th ఏప్రిల్ న, స్టార్ మా లో అఖండ ఆగమనం.  అభిమానులారా, మాస్ జాతరకు సిద్దం అవ్వండి.