సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మైంట్, 14 రీల్స్ ప్లస్సంస్థల నిర్మాణంలో టాలెంటెడ్ డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోంది. కీర్తీ సురేశ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు మ్యూజిక్ సెన్సెషన్ తమన్ స్వరాలు అందిస్తున్నారు. బ్యాంక్ మోసాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం మే 12న విడుదల కానుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా షూటింగ్ ని చిత్రయూనిట్ శరవేగంగా పూర్తి చేసే పనిలో పడ్డారు.
కాగా, ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం నుంచి తాజాగా సెన్సేషనల్ అప్ డేట్ వచ్చింది. “సర్కారు వారి పాట” సినిమాలో ఆఖరి పాట చిత్రీకరణను రామోజీ ఫిల్మ్ సిటీలో ఇప్పటికే ప్రారంభించాము. ప్రస్తుతం ఈ సాంగ్ కు సంబందించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ పాట చిత్రీకరణకు సంబంధించిన ఫోటోలను కూడా మరికొన్ని గంటల్లో పోస్ట్ చేస్తాం అంటూ చిత్రబృందం ట్వీట్ చేసింది. ఇక వేసవి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని మే 12న రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి.
Recent Comment