మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌ (Ram Charan) హీరోగా సీనియర్ డైరెక్టర్ శంకర్‌(Shankar) దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాలో రామ్‌చరణ్‌ రెండు విభిన్న పాత్రల్లో క‌నిపించ‌నున్నట్లు సమాచారం. అందులో ఒకటి స్టూడెంట్‌ పాత్ర కాగా, మరొకటి ప్ర‌భుత్వ ఉద్యోగి పాత్ర అన్నట్లు తెలుస్తోంది. ఇవే కాకుండా ఈ చిత్రంలో రామ్‌చరణ్‌ మరో సరికొత్త పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది.

అయితే, భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం అమృత్ సర్ లో చిత్రీకరణ జరుపుకొంటోంది. రామ్ చరణ్, కియారా అద్వానీల మీద అమృత్ సర్‌లోని ఓ యూనివర్సిటీలో కాలేజ్ సీన్లు తెరకెక్కిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ సినిమాలో ఓ కాలేజీ సాంగ్ ను ప్రస్తుతం మేకర్స్ షూట్ చేస్తున్నారు. ఇందులో విదేశీ డ్యాన్సర్లను కూడా రంగంలోకి దింపారు. అయితే ఈ పాటకు ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అదిరిపోయే స్టెప్పులను కంపోజ్ చేశాడని తెలుస్తోంది. అయితే ఈ పాట చిత్రీకరణకు సంబంధించిన వీడియోను ఆ డాన్స్ బృందంలోని ఓ సభ్యుడు రిలీజ్ చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో హల్చల్ చేస్తోంది.

కాగా, ఈ సినిమాకి స‌ర్కారోడు అనే టైటిల్‌ను చిత్రబృందం ప‌రిశీలిస్తున్న‌ట్టు తెలుస్తోంది. కాగా, ఈ సినిమాలో సునీల్, నవీన్‌ చంద్ర, అంజలి కీలక పాత్రలు పోషిస్తున్నారు. RC15 అనే వర్కింగ్‌ టైటిల్‌తో రూపొందుతున్న ఈ మూవీని ‘దిల్‌’ రాజు ఓ భారీ ప్యాన్‌ ఇండియా మూవీ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలనుకుంటున్నారు.