రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్(NTR), రామ్‌చరణ్ హీరోలుగా నటించిన చిత్రం ‘రౌద్రం.. రణం.. రుధిరం’ (ఆర్‌ఆర్‌ఆర్)(RRR). చారిత్రక పాత్రలకు ఫిక్షనల్ స్టోరీ జోడించి జక్కన్న తెరకెక్కించిన ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్(RAM CHARAN), ఆయన జోడీగా అలియాభట్ నటించింది. ఇక కొమురం భీమ్‌గా ఎన్టీఆర్ నటించగా ఆయనకు జోడీగా హాలీవుడ్ నటి ఓలివియా మోరిస్ అలరించింది. అయితే అభిమానులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న ఈ మూవీ ఎట్టకేలకు మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ క్రమంలోనే సినిమా సూపర్ హిట్ అంటూ అభిమానులు, ప్రేక్షుకులు, సినీ సెలెబ్రిటీలు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
అయితే ఆర్ఆర్ఆర్ సినిమాతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ డబుల్ హ్యాట్రిక్ హిట్ మూవీస్ రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుత తరం హీరోల్లో ఎవ్వరికీ సాధ్యం కానీ ఈ ఘనతను ఎన్టీఆర్ సాధించడంతో ఆయన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఎన్టీఆర్ టెంపర్‌తో తన మార్క్ హిట్ ను సాదించగా.. ఆ తర్వాత నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ మూవీస్ తో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించారు. అనంతరం జై లవకుశ, అరవింద సమేత వీర రాఘవ సినిమాతో భారీ హిట్ లను ఖాతాలో వేసుకున్న యంగ్ టైగర్ ఇప్పుడు ఆర్ఆర్ఆర్ తో డబుల్ హ్యాట్రిక్ సాధించారు.
Recent Comment