ఇటీవలే తండ్రి నాగార్జునతో కలిసి బంగార్రాజు సినిమాలో నటించిన అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya).. తాజాగా ‘థ్యాంక్యూ’ మూవీ చేస్తున్నాడు. విక్రమ్ కే కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ఇటీవల పూర్తయింది. ప్రస్తుతం శరవేగంగా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకులు ముందుకు రానుంది. అలాగే నాగచైతన్య ఓటీటీలోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. ‘ధూత’ అనే వెబ్ సిరీస్‌లో నాగ చైతన్య కీ రోల్ పోషిస్తూన్నాడు.

అయితే తాజా సమాచారం ప్రకారం తమిళ అగ్ర దర్శకుడు వెంకట్‌ ప్రభుతో నాగ చైతన్య తన తర్వాతి మూవీ చేయనున్నట్లు సమాచారం. గ్యాంబ్లర్, రాక్షసుడు, మానాడు వంటి సూపర్ హిట్ మూవీస్ రూపొందించిన వెంకట్‌ ప్రభు. తాజాగా నాగ చైతన్యతో తన నెక్స్ట్ మూవీ చేయనున్నట్లు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అలాగే నాగచైతన్యతో చేయనున్న సినిమాలో అతనికి జోడీగా పూజా హెగ్డేను ఫిక్స్ చేసినట్లుగా ఆయన చెప్పుకొచ్చారు. కాగా, త్వరలోనే వీరిద్దరి కాంబోపై అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది.