సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు(Mahesh Babu) ప్రస్తుతం పరశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సర్కారు వారి పాట’ (Sarkaru Vaari Pata) సినిమా చిత్రీకరణతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమా ముగిసిన తరువాత మహేశ్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ (Trivikram Srinivas) దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ఏప్రిల్ రెండో వారంలో ప్రారంభం కానుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ గాసిప్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

ఈ చిత్రంలో ఓ అతిథి పాత్రలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కనిపిస్తాడని టాక్ వినిపిస్తోంది. అయితే, త్రివిక్రమ్ శ్రీనివాస్ తో పవన్ కళ్యాణ్ కి ఉన్న స్నేహం కారణంగా పవన్ కళ్యాణ్ ఆ పాత్రలో నటించేందుకు ఒప్పుకున్నాడని టాక్‌ వినిపిస్తుంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందన్నది చూడాల్సి ఉంది. కాగా, అతడు, ఖలేజా తర్వాత మహేశ్‌ బాబు- త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మూడో చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.