మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) కథానాయకుడిగా, టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ (Koratala Shiva) దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఆచార్య’(Acharya) ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో రామ్‌చరణ్ కు జోడీగా పూజాహెగ్డే నటించారు. అయితే ఈ సినిమా ఏప్రిల్ 29వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న నేపథ్యంలో ఓ ఆసక్తికర అప్‌డేట్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది.
తాజా సమాచారం ప్రకారం ‘ఆచార్య’(Acharya) సినిమాను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో దాదాపు 1500 నుంచి 2000 స్క్రీన్స్‌పై విడుదల చేయబోతున్నారట. మెగా స్టార్ కు ఉన్న క్రేజ్ దృష్ట్యా మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ విషయం తెలిసినే మెగా అభిమానులు ఉప్పితబ్బిబయిపోతున్నారు. కాగా, ఆచార్య మూవీ ట్రైలర్‌ను ఈ సినిమా విడుదలకు రెండు వారాల ముందు రిలీజ్ చేయాలని చిత్రబృందం భావిస్తోందట. అలాగే ఏప్రిల్ నాలుగో వారంలో ఈ సినిమాకు సంబందించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్
గా నిర్వహించనున్నారని సమాచారం.
Recent Comment