కన్నడ స్టార్‌ హీరో యశ్‌(Yash) కథానాయకుడుగా, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్‌ నీల్‌(Prashanth Neel) దర్శకత్వంలో రూపొందుతున్న పాన్‌ ఇండియా మూవీ “కేజీఎఫ్‌-2″(KGF Chapter 2) నాలుగేళ్ల కిందట బాక్సాఫీస్‌ రికార్డులను తిరగరాసిన కేజీఎఫ్‌ సినిమాకు సీక్వెల్‌గా ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని హోంబలే ఫిలింస్‌ పతాకంపై విజయ్‌ కిరగందూర్ నిర్మిస్తున్నారు. కన్నడ, తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కేజీఎఫ్‌ 2 వేసవి కానుకగా ఏప్రిల్ 14న విడుదల కానుంది.

అయితే తాజాగా KGF chapter 2 మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ విష‌యంలోనూ అరుదైన రికార్డు సాధించింది. ఈ క్రమంలోనే రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా రికార్డుల‌ను KGF 2 బ్రేక్ చేసినట్లు సమాచారం. KGF 2 (హిందీ) సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ మల్టీప్లెక్స్‌లలో KGF గురువారం ఉదయం ప్రారంభమవగా.. ఇప్పటికే RRR (హిందీ) మూవీ అడ్వాన్స్‌ బుకింగ్స్ రికార్డులని అతి తక్కువ సమయంలో KGF2 వెనక్కినెట్టేసినట్లు తెలుస్తోంది ఇక ఈ సినిమాకు సంబంధించి తొలుత మల్టీప్లెక్స్‌లలో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయగా.. సింగిల్ స్క్రీన్‌లలో సోమవారం నుండి ఓపెన్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.