ఎన్నికల్లో, రిటర్నింగ్ అధికారికి, నామినేషన్ పాత్రలతో పాటు అఫిడవిట్ ధాఖలు చేయాలి. ఈ అఫిడవిట్ లో అస్థుల విలువను పొందుపరుస్తారు
ఈనాడు కధనం ప్రకారం, ఆంధ్ర ప్రదేశ్ ప్రస్తుత ముఖ్య మంత్రి వై ఎస్ జగన్ ఆస్తుల విలువ 2019 లెక్కల ప్రకారం 375 కోట్లు ఉంటే, 2024 లెక్కల ప్రకారం 529 కోట్లకు పెరిగింది.
అంటే జగన్ మోహన్ రెడ్డి ఆస్తుల విలువ, 5 సంవత్సరాలలో సుమారు 155 కోట్లు పెరిగింది. ఈ లెక్కన జగన్ కుటుంబ ఆస్తుల విలువ ఎంత పెరిగి ఉంటుంది.
ఒక కొత్త ఎన్నికల నియమావళి తీసుకు రావాలి. అదేంటంటే, దేశవ్యాప్తం గా, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల ఆస్తుల విలువలు, వారిపై ఎన్ని కేసులున్నాయ్ అనే వాటి వివరాలు, ప్రజలకు బగిరంగంగా, మీడియా ద్వారా తెలియ చేయాలి.
ఇక్కడ జగన్ మోహన్ రెడ్డి గారికి, అక్కడ అమిత్ షా గారికి పాపం సొంత కారు కూడా లేదట. కోట్లు సంపాదించిన కారు కొనే స్తోమత రాలేదు వీళ్లకు.
దేశవ్యాప్తం గా ఉన్న రాజకీయ నాయకుల ఆస్తుల విలువ ఎంత ఉంటుందో, మీరే ఊహించుకోండి. జనాల ఓట్లు రాజకీయ నాయకుల ఆస్తులు పెంచుకోవడానికీ ఉపయోగపడుతున్నట్లుంది
Recent Comment