పంజాబ్ కింగ్స్ , కోల్ కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 137 పరుగులకు అల్ అవుట్ అయ్యింది.  9  బంతుల్లో 31 పరుగులు చేసిన రాజపక్స టాప్ స్కోరర్.  ఆఖర్లో కగిసో రబడా 25 పరుగులు చేశాడు.

కోల్ కతా నైట్ రైడర్స్ బౌలర్ల లో ఉమేష్ యాదవ్ అద్భుతం గా బౌలింగ్ చేసి 4 వికెట్లు తీయగా, సౌథీ 2 వికెట్లు తీశాడు. శివమ్ మావి, సునీల్ నరైన్, రస్సెల్ తలా ఒక వికెట్ తీశారు.

అనంతరం 138 పరుగుల విజయ లక్ష్యం తో బ్యాటింగ్ ప్రారంభించిన కోల్ కతా నైట్ రైడర్స్ 51 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

అయితే సామ్ బిల్లింగ్స్, రస్సెల్ మరో వికెట్ పడకుండా స్కోర్ బోర్డ్ ను పరుగులు పెట్టించారు. ముఖ్యం గా రస్సెల్ కేవలం 31 బంతుల్లో 70 పరుగులు (6×8 | 4×2) చేసి అజేయం గా నిలిచాడు.  సామ్ బిల్లింగ్స్ 24 పరుగులతో చివరి వరకు నిలిచి రస్సెల్ కు చక్కని సహకర్రని అందిచాడు

పంజాబ్ కింగ్స్ బౌలర్ల లో రాహుల్ చాహర్ 2 వికెట్లు తీయగా, ఒడియాన్ స్మిత్, కగిసో రబడా తలా ఒక వికెట్ తీశారు.

ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ : రస్సెల్