పాన్ ఇండియా మూవీ ‘లైగర్‌’ తర్వాత హీరో విజయ్‌ దేవరకొండ ( Vijay Devarakonda ), దర్శకుడు పూరి జగన్నాథ్‌ ( Puri Jagannadh ) కాంబినేషన్‌లో ‘జనగణమన’ ( Janaganamana ) అనే సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం కూడా దాదాపు 80 కోట్ల బడ్జెట్ పెడుతున్నట్లు తెలుస్తోంది. చార్మీ కౌర్‌, దర్శకుడు వంశీ పైడిపల్లి ఈ పాన్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ను నిర్మించనున్నారు. ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ బాషల్లో పాన్‌ ఇండియా చిత్రంగా ఆగస్టు 3, 2023న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏప్రిల్‌ 2022లో షూటింగ్‌ ప్రారంభంకానుంది.

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో విజయ్ దేవరకొండకు జోడీగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్( Janhvi kapoor ) హీరోయిన్‌గా నటించబోతున్నట్టు తెలుస్తోంది. జాన్వీ తనకి అత్యంత ఇష్టమైన హీరో విజయ్ దేవరకొండ అని చాలా ఇంటర్వ్యూలలో చెప్పిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జాన్వీ ఈ సినిమా కథ వినగానే నటించేందుకు ఒప్పుకున్నట్లు సమాచారం. ఈ విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది. ఇదిలాఉంటే.. విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం ‘లైగర్‌’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్‌ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను ఆగస్టు 25న రిలీజ్‌ చేయనున్నట్లు ఇదివరకే ప్రకటించారు.