ఆంధ్ర ప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. దాని సారంశాము ఏమనగా, భారత దేశం లో సాయంత్రం ఆరు గంటల నుండి ఉదయం ఆరు గంటల వరకు 14000 MW విద్యుత్ అవసరం ఉండగా, 2000 MW విద్యుత్ మాత్రమే అందుబాటులో ఉంది. దేశ వ్యాప్తం గా వినియోగదారులకు సరిపడా విద్యుత్ అందుబాటులో లేనందువల్ల, అన్ని రాష్ట్రాలలో విద్యుత్ వాడకం లేదా లోడ్ ను తగ్గించే ప్రయత్నాలు ఇప్పటికే ప్రారంభించారు. గుజరాత్ లో ఇప్పటికే విద్యుత్ కోతలు మొదలైనాయి. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ వంతు వచ్చింది.
అయితే ముఖ్యమంత్రి Y S Jagan garu, గృహ వినియోగదారులకు, వ్యవసాయదారులకు ఎటువంటి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని ఆదేశించారు
ఇందుకోసం ఈ రోజు నుండి అనగా 8th ఏప్రిల్ నుండి 22nd ఏప్రిల్ వరకు పరిశ్రమలకు, వ్యాపార వర్గాలకు, విద్యుత్ సరఫరాను నియంత్రిస్తున్నారు.
అయితే వై స్ జగన్ ఆదేశాలను, అధికారులు పట్టించుకోవడం లేదు. పరిశ్రమలు, వ్యాపార వర్గాల కు మాత్రమే కాకుండా, సాధారణ ప్రజల కు కూడా విద్యుత్ కొత్త మొదలు పెట్టారు. ఉదయం 2-4 గంటలు, రాత్రి రెండు గంటల చొప్పున విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నారు. ఇక పల్లెల్లో పరిస్థితి మరింత దారుణం గా ఉంది. అసలే వేసవి కాలం దానికి తోడు ఈ విద్యుత్ కోతలు. సామాన్య ప్రజల అవస్థలు వర్ణనాతీతం.
ఈ విద్యుత్ సంక్షోభం నుండి రాష్ట్రాలు, మన దేశం తొందరగా బయటపడాలని ఆశిద్దాము
Recent Comment