దర్శకదిగ్గజం ఎస్‌ఎస్‌ రాజమౌళి(Rajamouli) దర్శకత్వంలో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌(NTR), మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌ (Ram Charan) కథానాయకులుగా తెరకెక్కించిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ (RRR) మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. విడుదలైన తొలి రోజు నుంచే కలెక్షన్ల వర్షం కురిపించిన ఈ చిత్రం ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా బాక్సఫీసు వద్ద సత్తా చాటుతోంది. ప్రపంచవ్యాప్తంగా విజయవంతగా 23రోజులు పూర్తి చేసుకున్న RRR సినిమా కలెక్షన్స్ ఏయే ప్రాంతాల్లో ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం…

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో (23వ రోజు) శనివారం సెలవు దినం కావడంతో అన్ని థియేటర్స్ వద్ద అభిమానులు పోటెత్తారు. ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ సినిమా మొత్తంగా ఈ 23 వ రోజుకు గాను 67 లక్షల రూపాయలు వసూలు చేసింది. ఇందులో నైజాంలో అత్యధికంగా 31 లక్షల కలెక్షన్స్ రాబట్టింది. ఇకపోతే మొత్తంగా ఈ 23 రోజుల్లో కలిపి చూస్తే 262.58 కోట్ల నెట్, 396.05 కోట్ల గ్రాస్ వసూలైంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా చూస్తే విడుదలైన 23 రోజుల్లో ఈ సినిమా 581.69 కోట్ల నెట్, 1071 కోట్ల గ్రాస్‌ వసూలు చేసినట్లు సమాచారం. విడుదలకుముందు 451 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన RRR మూవీ ప్రస్తుతం 130 కోట్లకు పైగా లాభాలతో కొనసాగుతోంది.