దర్శకదిగ్గజం ఎస్‌ఎస్‌ రాజమౌళి దర్శకత్వంలో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌ హీరోలుగా తెరకెక్కించిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమాను చూసేందుకు అభిమానులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. అయితే తొలి మూడు రోజుల్లోనే కలెక్షన్ల సునామి సృష్టించిన ఈ సినిమా ఐదో రోజు మంగళవారం కూడా బాక్సఫీసు వద్ద దుమ్మురేపింది. ఈ నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ సినిమా ఫ‌స్ట్‌వీక్‌ క‌లెక్ష‌న్ల‌ను ఏరియా వైజ్‌గా ఇప్పుడు చూద్దాం…

★నైజాం : 77.30 కోట్లు
★సీడెడ్ : 37.28 కోట్లు
★ఉత్త‌రాంధ్ర : 21.00 కోట్లు
★ఈస్ట్ : 11.65 కోట్లు
★వెస్ట్ : 9.76 కోట్లు
★గుంటూరు : 14.08 కోట్లు
★కృష్ణ : 10.80 కోట్లు
★నెల్లూరు : 6.45 కోట్లు

మొత్తంగా చూస్తే ఆర్ఆర్ఆర్ సినిమా (తెలంగాణ+ఆంధ్రప్రదేశ్) రాష్ట్రాల్లో కలిపి తొలి వారం రోజుల్లో 188.32 కోట్లు (281కోట్ల గ్రాస్‌) కలెక్షన్లు రాబట్టింది. అలాగే ఈ సినిమా హిందీలో 65.87 కోట్లు, కర్ణాట‌క‌,రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలిపి 33.10 కోట్లు అలాగే తమిళనాడులో 25.42 కోట్లు, కేరళలో 7.60 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో 4.65 కోట్లు, ఓవర్సీస్‌లో 73.93కోట్లు వసూలు చేసింది. మొత్తంగా వరల్డ్ వైడ్ గా ఈ మూవీ తొలి వారం రోజుల్లో 394.24 కోట్ల షేర్‌, 715 కోట్ల గ్రాస్‌ కలెక్షన్లు రాబట్టింది.