యావత్ సినీ ప్రపంచాన్ని సంబ్రమాశ్చర్యాల్లో ముంచెత్తిన హాలీవుడ్ విజువల్ వండర్‌ చిత్రం ‘అవతార్‌’ (Avatar ). దర్శక దిగ్గజం జేమ్స్‌ కామెరూన్‌ డైరెక్షన్ లో రూపొందిన అవతార్ సినిమా 2009లో విడుదలవగా… అప్పటి వరకు ఉన్న హాలీవుడ్‌ కలెక్షన్‌ రికార్డులన్నింటినీ బద్దలుకొట్టి అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా అవతార్‌ ఆల్‌టైం రికార్డ్‌ను సాధించింది. ఇక ఈ సినిమా ఘనవిజయం సాధించటంతో సీక్వెల్స్‌కు ప్లాన్‌ చేశారు చిత్రయూనిట్.

ఈ క్రమంలోనే మేకర్స్ భారీ బడ్జెట్ తో అవ‌తార్ 2 (Avatar 2) సినిమాను రూపొందిస్తున్నారు. ఈ చిత్రం ఈ ఏడాది డిసెంబ‌ర్ 16న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల కానుంది. ఈ క్రమంలో అవ‌తార్ 2 మూవీ ట్రైల‌ర్( Avatar 2 Movie Traile)కు సంబంధించిన వార్త ప్రస్తుతం ఇండ‌స్ట్రీలో వైరల్ గా మారింది. తాజా సమాచారం మే 6న అవ‌తార్ 2 ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ట్రైలర్ కోసం యావత్ సినీ ప్రపంచం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కాగా, పండోరా గ్రహంలోని వింత జీవులు మానవులతో చేసిన పోరాటమే ఈ సినిమా కథ అనే సంగతి తెలిసిందే.