కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్(Vijay) వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే ఆయన నటించిన చిత్రం ‘బీస్ట్‌’ మూవీ ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కోలీవుడ్‌ మ్యూజిక్ సెన్సెషన్‌ అనిరుధ్‌ రవిచంద్రన్‌ సంగీతం అందించారు. ఇదిలావుంటే, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ ఓ ద్విభాషా చిత్రం చేయబోతున్న సంగతి తెలిసిందే.

ఇటీవలే ఈ సినిమా లాంచ్ చెన్నైలో అంగరంగవైభవంగా జరిగింది. విజయ్‌ కెరీర్ లో 66వ చిత్రంగా రూపొందనున్న ఈ సినిమాను శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌లో దిల్‌ రాజు నిర్మిస్తున్నాడు. టాలీవుడ్ మ్యూజిక్ తమన్‌ సంగీత స్వరాలూ సమకూరుస్తున్నాడు. ఈ సినిమాలో విజయ్‌కు జోడీగా నేషనల్ క్రష్ రష్మిక మందన్నా( Rashmika Mandanna )నటిస్తోంది. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఆస‌క్తిక‌ర అప్ డేట్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో విజ‌య్‌కు తండ్రి పాత్రలో శ‌ర‌త్ కుమార్ ( sarathkumar) నటించనున్న‌ట్టు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం.