కోలీవుడ్‌ స్టార్ హీరో విజయ్‌ ముఖ్య పాత్రలో నటించిన చిత్రం ‘బీస్ట్‌’ ( Beast Movie ). నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో టాలీవుడ్‌ బుట్టబొమ్మ పూజా హెగ్డే (Pooja Hegde ) కథానాయికగా నటించింది. ఈ సినిమాలో షైన్‌ టామ్‌ చాకో, సెల్వరాఘవన్‌, యోగిబాబు ప్రధాన పాత్రలు పోషించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సన్‌ పిక్చర్స్‌ బ్యానర్‌లో కళానిధి మారన్‌ నిర్మాతగా వ్యవహరించగా అనిరుధ్‌ రవిచంద్రన్‌ సంగీత స్వరాలూ సమకూర్చారు. అయితే భారీ తారాగ‌ణం, భారీ బడ్జెట్‌, హై టెక్నిక‌ల్ వేల్యూస్‌తో రూపొందిన ఈ చిత్రం భారీ అంచ‌నాల మధ్య ఏప్రిల్ 13న విడుదలైంది. అంచ‌నాల‌ను మించేలా ‘బీస్ట్’ సినిమా బాక్సాఫీస్ రికార్డుల‌ను తిర‌గ రాస్తూ సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుంది.

ఈ నేపథ్యంలో ‘బీస్ట్‌’ మూవీ ఓటీటీ రిలీజ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సిల్వర్ స్క్రీన్ పై ఈ సినిమాను ఎంజాయ్ చేసిన ప్రేక్షకులంత ఇక డిజిటల్‌ స్ట్రీమింగ్‌ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఈ సినిమా గురించి తాజాగా ఓటీటీ అప్‌డేట్‌ వచ్చింది. ఈ క్రమంలో ‘బీస్ట్‌’ చిత్రాన్ని మే 13వ తేదీ నుంచి దక్షిణాది భాషల్లో ఈ మూవీని సన్‌ నెక్స్ట్‌ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్‌ చేసేందుకు మేకర్స్ ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక బీస్ట్‌ హిందీ వెర్షన్‌ డిజిటల్‌ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్‌ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అందులో కూడా ఈ సినిమా మే 13వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా రానుందని సమాచారం.