చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య జరుగుతన్న మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.  మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 5 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. ఓపెనర్ ఉతప్ప 3 పరుగులు, మొయిన్ అలీ ఒక పరుగు చేసి అవుట్ అయ్యారు.  శివం దూబే 19 పరుగులు చేసి రన్ ఔట్ అయ్యాడు

మరో ఓపెనర్ ఋతురాజ్ గైక్వాడ్ 48 బంతుల్లో 73 పరుగులు చేసి రాణించాడు. రాయుడు 31 బంతుల్లో 46 పరుగుల తో రాణించాడు. ఆఖర్లో కెప్టెన్ జడేజా ధాటిగా ఆడి 12 బంతుల్లో 22 పరుగులు చేశాడు

గుజరాత్ టైటాన్స్ బౌలర్ల లో జోసెఫ్ రెండు వికెట్లు తీయగా, షమీ, దయాల్ చెరో ఒక వికెట్ తీశారు