యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas), బుట్టబొమ్మ పూజా హెగ్డే (Pooja Hegde) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘రాధేశ్యామ్’(Radhe Shyam). జిల్ ఫేం రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని యువీ కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణామూవీస్, యువీ క్రియేషన్స్ పతాకాలపై వంశీ, ప్రమోద్, ప్రశీద ఈ సినిమాను నిర్మించారు. ఇందులో ప్రభాస్ విక్రమాదిత్య అనే పాత్రలో కనిపించగా.. పూజా హెగ్డే ప్రేరణ అనే మ్యూజిక్ టీచర్ పాత్రలో కనిపించింది. ఈ సినిమాకు దక్షిణాది భాషలకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం సమకూర్చగా, తమన్ నేపథ్య సంగీతం అందించాడు.
అయితే మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మిశ్రమ స్పందనలను అందుకుంది.
తాజాగా ఈ అంశంపై దర్శకుడు రాధాకృష్ణ స్పందించారు. ‘రాధేశ్యామ్’ సినిమాపై నెగెటివిటీ ఎందుకు వచ్చిందో అర్థం కావట్లేదు. కానీ, విడుదలై రోజులు గడుస్తున్న కొద్దీ ఇప్పుడు ప్రతి ఒక్కరూ సినిమా చాలా బాగుందని చెబుతున్నారు. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన తరువాత ప్రభాస్‌ను కలవలేదు. కానీ సమయం దొరికినప్పుడు మాత్రం మెస్సేజ్‌లు చేసుకుంటున్నాం. తొలి మూడు రోజులు నా ఇమేజ్ సినిమాని డామినేట్ చేసేస్తుంది అని ప్రభాస్ నాతో చాలా సార్లు అన్నాడు అని రాధాకృష్ణ కుమార్ చెప్పుకొచ్చారు
Recent Comment