ఇద్దరు గొప్ప స్వాతంత్య్ర సమరయోధులు సమాజం కోసం ఏకమైతే ఎలా ఉంటుంది? అన్నవిభిన్న కథాంశంతో రూపొందుతున్న చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌(రౌద్రం రణం రుధిరం)(RRR). ఇందులో కొమురం భీమ్‌గా యంగ్ టైగర్ ఎన్టీఆర్‌(NTR), అల్లూరి సీతారామరాజుగా మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌(RAM CHARAN) నటిస్తున్నారు. పాన్‌ఇండియా లెవెల్లో రూపొందుతున్న ఈ సినిమాలో చరణ్ కు జోడిగా ఆలియా భట్‌(ALIA BHATT) నటిస్తుండగా.. ఎన్టీఆర్ కు జంటగా హాలీవుడ్‌ నటి ఒలీవియా మోరిస్‌ నటించనున్నారు.

ఈ సినిమా మార్చి 25, 2022న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుండగా.. తాజాగా ఈ సినిమాకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రోజుకు ఐదు షోలు వేసుకునేందుకు అనుమతిచ్చింది. తెలంగాణాలో ఉదయం 7 నుంచి రాత్రి ఒంటి గంట మధ్య థియేటర్లలో ఐదు షోలు ప్రదర్శించుకునే ఛాన్స్ ఇచ్చింది. అలాగే ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా విడుదలైన తర్వాత తొలి మూడు రోజుల వరకు ఏసీ థియేటర్లలో టికెట్పై రూ.50 ఎక్కువగా ఛార్జ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత తొలి వారం ముగిసే వరకు రూ.30 అధికంగా వాసులు చేయవచ్చు.
ఇక అంతకుముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా అన్ని రకాల టికెట్లపై అదనంగా రూ.75 మేర వసూలు చేసుకునేందుకు అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే.