టాలీవుడ్ అగ్రకథానాయకులు వెంకటేశ్, వరుణ్‌ తేజ్‌ హీరోలుగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఎఫ్ 3’. ఈ సినిమాని ‘దిల్‌’ రాజు సమర్పణలో శిరీష్‌ నిర్మిస్తున్నారు. అనేక వాయిదాల తర్వాత మే 27న ఎఫ్‌ 3ని విడుదల చేయబోతున్నట్లు ఇటీవల చిత్రం బృందం ప్రకటించింది. దేవిశ్రీప్ర‌సాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో ఓ స్పెష‌ల్ సాంగ్ ఉంది. అయితే ఆ స్పెష‌ల్ సాంగ్ కోసం బుట్ట‌బొమ్మ‌ పూజా హేగ్డేను రంగంలోకి దింపారు మేకర్స్. ఈ సినిమాలో పూజా చేస్తున్న స్పెష‌ల్ సాంగ్ కు సంబంధించి ఓ స్టిల్ ను కూడా చిత్రబృందం విడుదల చేశారు.

పూజా హెగ్డే చేస్తున్న ఈ స్పెషల్‌ సాంగ్‌ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుందని చిత్రబృందం ధీమాగా ఉన్నారు. ఈ సాంగ్ కోసం పూజా హెగ్డే సుమారు కోటి రూపాయలు తీసుకున్నట్లు సమాచారం. ఇక అంతకుముందు రామ్ చరణ్ రంగ‌స్థ‌లం సినిమాలో స్పెష‌ల్ సాంగ్ చేసింది పూజా హేగ్డే. ఆత‌ర్వాత ఇప్ప‌టి వ‌ర‌కు స్పెష‌ల్ సాంగ్ చేయ‌లేదు. ఆ తరువాత ఎఫ్ 3లో స్పెష‌ల్ సాంగ్ కి ఓకే చెప్ప‌డం విశేషం.
ఒకే స్క్రీన్‌పై పూజా హెగ్డే, వెంకటేష్, వరుణ్‌ తేజ్‌, తమన్నా, మెహ్రీన్, సోనాల్‌ చౌహన్‌ కనిపించడం ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ అని చెప్పొచ్చు. మ‌రి.. పూజా హెగ్డే చేస్తున్న ఈ సాంగ్ ఈ సినిమాకి క‌లిసొస్తుందా..? ఎఫ్ 3 సూపర్ హిట్ అవుతుందా..? అనేది తెలియాలంటే మే 27 వ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే.