పాన్ ఇండియా స్టార్‌ ​ప్రభాస్‌(Prabhas) ప్రస్తుతం కెజిఎఫ్ మూవీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్‌’ (Salaar) సినిమాలో నటిస్తున్న సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతుంది. ఇందులో హీరోయిన్‌గా శ్రుతీ హాసన్‌ ఆద్య పాత్ర పోషిస్తోంది. పాన్‌ ఇండియా లెవల్లో రూపొందుతున్న ఈ చిత్రానికి రవి బస్‌రూర్‌ సంగీతం అందిస్తుండగా… సీనియర్ నటుడు జగపతిబాబు ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు.

అయితే స‌లార్ మూవీ అనౌన్స్ చేసిన‌ప్ప‌టి నుంచి ఓ వార్త వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ప్ర‌శాంత్ నీల్ తొలి కన్నడ చిత్రం ఉగ్ర‌మ్ కు (Ugramm) రీమేక్ గా సలార్ రూపొందుతుందని కొన్ని రోజులుగా ఓ వార్త వినిపిస్తోంది. అయితే ఈ అంశంపై డైరెక్టర్ ప్ర‌శాంత్ నీల్ తాజాగా స్పష్టతనిచ్చాడు. నేను తీయ‌బోయే ప్ర‌తీ మూవీలో ఉగ్ర‌మ్ సినిమా ప్రభావం అనేది ఉంటుంది. కానీ స‌లార్ ఒక ఫ్రెష్ స్టోరీ. ఉగ్ర‌మ్‌కు రీమేక్ అనేది అవాస్తవం అని ప్ర‌శాంత్ నీల్ తేల్చిచెప్పారు. కాగా, సలార్ మూవీ వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.