మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ (Ram Charan) నేటితో 37వ వసంతంలోకి అడుగు పెడుతున్నాడు. మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా సినీ ప్రముఖులు, నటీనటులు, అభిమానుల నుంచి సోషల్‌ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. ఇప్పటికే సోషల్‌ మీడియాలో హ్యపీ బర్త్‌డే రామ్‌ చరణ్‌ (HBD Ramcharan) అంటూ దుమ్మురేపుతున్నారు ఫ్యాన్స్. ఇటు ట్విటర్‌లోనూ రామ్‌చరణ్‌ పేరుతో ఓ హ్యష్‌ట్యాగ్‌ ట్రెండింగ్‌లో నిలిచింది.

ఇక చిరుత సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రామ్‌చరణ్‌, ఆ తర్వాత నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుని తండ్రి చిరంజీవికి తగ్గ తనయుడిగా నిలిచాడు. తాజాగా రామ్ చరణ్ నటించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం చూసిన జనాలు చెర్రీ నటన చూసి శభాష్‌ అంటున్నారు. రామరాజుగా చరణ్ యాక్షన్‌కు అభిమానులు ఫిదా అవుతున్నారు.

రామ్ చరణ్ నట విశ్వరూపం కారణంగా భారీ కలెక్షన్లతో ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసేందుకు సిద్ధమవుతోంది. ఇక మెగాస్టార్ వారసుడిగా, ఆయన నట వారసత్వాన్ని కొనసాగిస్తూ కెరీర్ లో దూసుకుపోతున్న రామ్ చరణ్‌కి మీ మా ‘వార్తా వినోదం’ తరఫున ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాం