యంగ్ టైగర్ ఎన్టీఆర్(Ntr) అగ్ర దర్శకుడు కొరటాల శివ(Koratala Shiva) కాంబినేషన్‌లో ఓ రూపొందనున్న సంగతి తెలిసిందే. చాలా రోజుల కిందటే ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన సైతం వెలువడింది. జనతా గ్యారేజ్ తర్వాత వీరిద్దరి కాంబోలో రూపొందుతున్న ఈ మూవీకి కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీత స్వరాలు సమకూర్చనున్నాడు. యువ సుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇందులో ఎన్టీఆర్ కు జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్(Alia Bhatt) నటిస్తుందని వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.
అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా నుంచి ఆలియా భట్ తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఏప్రిల్ 14న మధ్యాహ్నం 3 గంటలకు రణ్‌బీర్, ఆలియాలు పెళ్లి చేసుకోనున్నట్లు సమాచారం. ఈ కారణంగానే ఆమె ఈ సినిమా నుంచి తప్పుకోనున్నట్లు. కొరటాల శివ ఈ సినిమాను జూన్ తొలి వారంలో రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించాలని అనుకుంటున్నారు. అయితే తన పెళ్లి తర్వాత ఆలియా-రణ్‌బీర్ కొంత కాలం సినిమాలకు విరామం ప్రకటించాలని అనుకుంటున్నారట. ఈ కారణంతోనే ఆమె ఎన్టీఆర్ చిత్రం నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం.
Recent Comment