మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఆచార్య’. కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో సిద్ధ పాత్రలో రామ్‌చరణ్, నీలాంబరి పాత్రలో పూజాహెగ్డే నటించారు. రామ్‌చరణ్, నిరంజన్‌ రెడ్డి, అన్వేష్‌ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్‌ 29న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆచార్య ట్రైలర్ విడుదలకు సంబంధించి అప్డేట్​ను తాజాగా మేకర్స్ ప్రకటించారు.

ఏప్రిల్ 12న ఆచార్య సినిమా ట్రైలర్​ను రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించింది చిత్రబృందం. కాగా, ఇక వరుసగా తెలుగు చిత్రాలు హిందీలో విజయం సాదిస్తుండటంతో ‘ఆచార్య’ను కూడా హిందీలో విడుదల చేస్తున్నట్టు తెలుస్తుంది. అలాగే
మెగాస్టార్ కు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో దాదాపు 1500 నుంచి 2000 స్క్రీన్స్‌పై ఈ సినిమా విడుదల చేయబోతున్నట్లు సమాచారం.