పవర్​ స్టార్ పవన్​ కల్యాణ్(Pawan Kalyan)​ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘హరిహర వీరమల్లు'(Hari hara Viramallu). ఈ చిత్రానికి ప్రముఖ డైరెక్టర్‌ క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. మొఘల్‌ సామ్రాజ్యం నేపథ్యంలో 17వ శతాబ్దపు కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. మెగా సూర్య ప్రొడక్షన్స్​ బ్యానర్​పై ప్రముఖ నిర్మాత ఏంఎం రత్నం నిర్మిస్తున్న ఈ మూవీలో హీరోయిన్​గా నిధి అగర్వాల్​ నటిస్తోంది.

అయితే ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ షెడ్యూల్​లో భాగంగా పద్మశ్రీ తోట తరణి గారు వేసిన భారీ సెట్​లో యాక్షన్​ సీన్స్ రూపొందిస్తున్నారట. ఈ షెడ్యూల్ లో పవన్​ కళ్యాణ్ ఒక్కడే వేయి మందితో యుద్ధం చేయబోతున్నారని సమాచారం. ఈ ఫైట్​ సినిమాకే హైలైట్​గా నిలవబోతుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఈ వార్త విన్న పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు ఈ సినిమా విడుదలవుతుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా, రూ. 180కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాలో ఔరంగజేబు పాత్రలో అర్జున్ రాంపాల్, బాలీవుడ్​ ముద్దుగుమ్మ జాక్వెలిన్​ ఫెర్నాండెజ్​​ నటించనున్నట్లు సమాచారం.