ఎస్‌ఎస్‌రాజమౌళి(Rajamouli) దర్శకత్వంలో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌(NTR), మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌(Ram Charan) హీరోలుగా తెరకెక్కించిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ (RRR) మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమాను చూసేందుకు అభిమానులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. అయితే ఈ మూవీ విడుదలైన 10 వారం రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను క్రాస్ చేసి ప్రాఫిట్స్ లోకి దూసుకెళ్లింది.

అయితే ఆర్ఆర్ఆర్ సినిమా నైజాం డిస్ట్రిబ్యూషన్ రైట్స్ సీనియర్ ప్రొడ్యూసర్ దిల్ రాజు దక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే నైజాంలో 100 కోట్ల మైలురాయిని చేరుకున్న తొలి సినిమాగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రికార్డును సాధించింది. దీంతో సంతోషంలో ఉన్న దిల్ రాజు ఆర్ఆర్ఆర్ మూవీ చిత్రబృందానికి ఈ రోజు గ్రాండ్ గా పార్టీని ఇస్తున్నాడు. హైద‌రాబాద్‌లోని ఎన్ క‌న్వెన్ష‌న్‌లో ఏర్పాటు చేసిన ఈ పార్టీకి ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ తో పాటు టాలీవుడ్‌కు చెందిన సినీ ప్రముఖులు హాజ‌ర‌య్యారు. కాగా, అంతకుముందు ‘అఖండ’ చిత్రబృందానికి కూడా దిల్ రాజు ఇలాగే గ్రాండ్ పార్టీ ఇచ్చిన సంగతి తెలిసిందే.