యావత్ సినీ ప్రపంచం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న భారీ మల్టీ స్టారర్‌ చిత్రం “రౌద్రం.. రణం.. రుధిరం” (ఆర్‌ఆర్‌ఆర్‌) దర్శకదీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి (Rajmouli)దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కొమురం భీమ్‌గా యంగ్ టైగర్ ఎన్టీఆర్‌(Ntr), అల్లూరి సీతారామరాజుగా మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌(Ramcharan) ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తారక్‌ సరసన ఒలివియా మోరీస్‌, చెర్రీకి జోడిగా అలియా భట్ కనువిందు చేయనున్నారు. దాదాపు రూ. 400 కోట్లు భారీ బడ్జెట్‌తో ఈ పాన్‌ ఇండియా సినిమాను డీవీవీ దానయ్య నిర్మించారు. కాగా, ఈ మోస్ట్​ అవేయిటెడ్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మార్చి 25న విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే.

అయితే ఈ సినిమా కోసం రాజమూలి అందుకుంటున్న రెమ్యునరేషన్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. నిజానికి ఈ సినిమా కోసం రాజ‌మౌళి పారితోషికం అందుకోవడం లేదు. తాజా సమాచారం ప్రకారం దర్శకుడు రాజ‌మౌళి ఈ సినిమా లాభాల్లో 30 శాతం ఇవ్వాల‌ని నిబంధనతో సినిమా ప్రారంభించార‌ట‌. ఉదాహరణకు ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా లాభం రూపం రూ.1500 కోట్లు వచ్చిందనుకోండి. ఇందులో 30 శాతం అంటే దాదాపు రూ.450 కోట్లు వ‌ర‌కు రాజ‌మౌళికి పారితోషికం అందుతుందని ట్రేడ్ విశ్లేషకులు పేర్కొంటున్నారు.