మెగాస్టార్‌ చిరంజీవి(Chiranjeevi) కథానాయకుడిగా, టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ (Koratala Shiva) దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఆచార్య’(Acharya) ఇందులో మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో రామ్‌చరణ్ కు జోడీగా పూజాహెగ్డే నటించారు. ఈ సినిమాను ఏప్రిల్ 29న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.

అయితే ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన సాంగ్స్, టీజర్ కి అభిమానుల నుండి, ఫుల్ రెస్పాన్స్ లభిస్తోంది. అలాగే ఈ సినిమా విడుదల తేది దగ్గర పడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ ను ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఆచార్య మూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏప్రిల్ 24న యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో ఘనంగా నిర్వహించ నున్నట్లు తెలుస్తోంది. దదీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. అలాగే ఈ సినిమా మోస్ట్ అవైటెడ్ ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తుండగా మేకర్స్ ఏప్రిల్ రెండో వారంలో రిలీజ్ చేయనున్నట్లు సమాచారం.