హైదరాబాద్‌లో తాజాగా బయటపడిన డ్రగ్స్ వ్యవహారం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. సెలబ్రిటీలు ఇలా డ్రగ్స్‌కి బానిసలు అవుతుండటం తీవ్ర చర్చనీయాంశం అయింది. ఇక ఆదివారం తెల్లవారు జామున 3 గంటల సమయంలో జరిగిన ఈ దాడుల్లో దాదాపు 150 మందిని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. వీరిలో ప్రముఖ నటుడు కొణిదెల నాగబాబు కుమార్తె నిహారిక, బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రేవ్ పార్టీలో భారీగా డ్రగ్స్ వాడారని పోలీసులు చెబుతున్నారు.
అయితే నిహారికను పోలీసుస్టేషన్‌కు తరలించిన వ్యవహారంపై తాజాగా నాగబాబు స్పందించారు. “గతరాత్రి రాడిసన్ బ్లూ హోటల్ పబ్‌లో జరిగిన సంఘటనపై స్పందించడానికి కారణం…నా కూతురు నిహారిక ఆ సమయానికి అక్కడుండటమే. పబ్ టైమింగ్స్ పరిమితికి మించి నడపడం వల్ల పబ్ మీద పోలీసులు చర్యలు తీసుకున్నారు. నిహారిక విషయంలో ఎలాంటి తప్పు లేదని పోలీసులు చెప్పారు. అనుమానాలకు తావివ్వకుండా నేను స్పందిస్తున్నా. దయచేసి అనవసర ప్రచారాలు చేయవద్దు ” అని నాగబాబు తెలిపారు.
Recent Comment