నరేంద్ర మోడీ సారధ్యం లో భారతి జనతా పార్టీ రెండు సార్లు అధికారం చేజిక్కించుకుంది.  మూడవసారి అధికారం 400 సీట్లతో  చేజిక్కించుకోవాలని అనుకుంటున్నారు.  అయితే ఆది సాధ్యమేనా…??                                                                                                                              

ఏ ప్రభుత్వానికైనా రెండు సార్లు అధికారం ఇస్తారు.(పరిపాలన దారుణం గా ఉంటె తప్ప).  మూడవ సారి వోట్ వేసే ముందు ప్రజల అనేక రకాలుగా ఆలోచిస్తారు.  నరేంద్ర మోడీ చరిష్మా కో ఢోకా లేదు.  నరేంద్ర మోడీ నాయకత్వం పై అనుమానం లేదు.  అయితే ప్రతిపక్షాలు మోడీ ని ఓడించాలని కంకణం కట్టుకుని మరి ప్రచారం చేస్తున్నాయి.  బీహార్ చీఫ్ మినిస్టర్ నితీష్ కుమార్ మళ్ళీ భారతి జనతా పార్టీ లో కి జంప్ చేశారు. ఈ పరిణామం అనుకూలిస్తుందా…ప్రతికూలింస్తుందా వేచి చూడాలి.  బీజేపీ ఒంటరి గా ఎన్ని స్థానాలు గెలుస్తుంది.  NDA కూటమి గా ఎన్ని స్థానాలు గెలుస్తుంది అనేది తెలియరావాలి.

అయితే ఇప్పటికి అత్యధికంగా 1984 లో 414 స్థానాలు గెలుచుకున్న పార్టీ గా కాంగ్రెస్ రికార్డు అలానే ఉంది.  నరేంద్ర మోడీ చరిష్మా ఈ రికార్డు బద్దలు కొడుతుందా.

భారతీయ జనతా పార్టీ 2014 ఎన్నికలో 282 స్థానాలు 2019 ఎన్నికల్లో 303 స్థానాలు గెలుచుకుంది.  2014 నుండి 2019 కి 21 స్థానాలు అదనంగా గెలుచుకుంది.   ఇప్పుడు అమాంతం ఎన్ని స్థానాలు అదనంగా గెలుచుకోగలదు. 

అత్యధిక సీట్లు గలిగిన ఉత్తర్ ప్రదేశ్ పై పూర్తి పట్టు సాధించాలి.  ఈ హోరా హోరి పోరులో భారతీయ జనతా పార్టీ, ఇండియా కూటములు  ఉత్తర ప్రదేశ్ పై ఎక్కువ ఫోకస్ చేస్తారనడం లో సందేహం లేదు.

భారతీయ జనతా పార్టీ కి దక్షిణాన అంత పట్టు లేదు.  ఇండియా కూటమి కి దక్షిణాన ఉంది మంచి పట్టు ఉంది (సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ మరి).

మేనిఫెస్టో, ప్రజలను ఆకట్టుకునే ఉపన్యాసాలు, అభివృద్ధి, నాయకుల మీద నమ్మకం, డబ్బు వంటి ఎన్నో అంశాలు గెలుపు , ఓటములను ప్రభావితం చేస్తాయి